
ప్రస్తుతం ఒకేసారి రెండు చిత్రాల చిత్రీకరణలో ఉన్న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా వైరస్ నేపథ్యంలో షూట్ నుంచి వీరారం తీసుకున్నారు. 'విరూపాక్ష' అనేది క్రిష్-పవన్ కలియకలో వస్తున్న మొదటి చిత్రం. దీనిని బడా నిర్మాత ఎ.ఎమ్.రత్నం నిర్మిస్తున్నారు. తాజా వార్త ఏమిటంటే, స్వాతంత్య్రానికి పూర్వం బ్యాంకులు ఎలా ఉండేవి అన్న నేపథ్యంలో సాగే ఈ కధ కోసం భారీ విజువల్ ఎఫెక్ట్స్ అవసరం. దీంతో టీం ప్రముఖ విఎఫ్ఎక్స్ వ్యవస్థాపకుడు బెన్ లాక్ ను మేకర్స్ ఎంపిక చేశారట. బెన్ లాక్ స్టార్ వార్స్ మరియు ఇతర పెద్ద హాలీవుడ్ ప్రాజెక్టులకు పనిచేశారు. క్రిష్ తన విఎఫ్ఎక్స్ మ్యాజిక్ తో పవన్ అభిమానులను ఎలా ఆశ్చర్యపరుస్తాడో చూడాలి!
Tags: #pawankalyan #PK #powerstar #pspk28