
తమిళ నటుడు కార్తీ నటించిన తాజా సినిమా "ఖైది". ఒక పాట లేకుండా, హీరోయిన్ లేకుండా సీట్లకు కట్టిపడేసే స్క్రీన్ ప్లేతో వసూళ్ల వర్షం కురిపిస్తుంది. తమిళ్ లొనే కాక తెలుగులో సైతం రికార్డులు బద్దలు కొడుతుంది. కధ, కార్తీ యాక్షన్ తో పాటు సినిమా టైటిల్ ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ సినిమా "ఖైది" టైటిల్ అవ్వటంతో ఇంకొంచెం ప్లస్ అయ్యిందని చెప్పక తప్పదు. ఇక ఖైది సక్సెస్ చూసి ఖైది 2 కోసం రంగం సిద్ధం చేస్తున్నారు. షూటింగ్ ను కేవలం 90రోజుల్లో పూర్తి చేస్తానని డైరెక్టర్ కార్తీతో అనటం కూడా అయిందట. ఇదిలావుంటే, ఖైది హాట్ స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. రిలీజ్ అయిన 30 రోజులకే ఆన్లైన్లోకి వచ్చేసింది. దీంతో ఎగ్జిబిటర్లు చర్చలు మొదలుపెట్టారు. నిన్నటికి సినిమా హౌస్ ఫుల్ షోతో నడిచింది. కానీ ఆన్లైన్లో రావటంతో ఖచ్చితంగా దెబ్బ పడుతుందని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. దీని బదులు ప్రొడ్యూసర్లతో ఆన్లైన్లో వస్తే ఇక సినిమాను థియేటర్లలో వుంచమని ఉప్పందం చేసుకుంటే సరిపోతుందని చర్చించారు. అయితే ఖైది ప్రొడ్యూసర్ ఎస్ ఆర్ ప్రభు రంగంలోకి దిగి 30రోజుల్లో ఆన్లైన్లో ఆఫీషల్ గా రావటం వల్ల పైరసీ తగ్గుతుందని ప్రొడ్యూసర్లకు ఎంతో మేలు చేస్తుందని కూల్ గా డీల్ చేశారు.