
దర్శక దిగ్గజం రాజమౌళి బాహుబలి సినిమాతో ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా చాటి సినీ ప్రేక్షకులు, సినీ ఇండస్ట్రీ గర్వపడేలా చేసాడు. అలాంటి ఇంటర్నేషనల్ స్థాయి సినిమాను అందించిన రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో 'ఆర్ఆర్ఆర్' అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నాడు. మాస్ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు బడా హీరోలతో జక్కన్న సినిమా తిస్తున్నాడనే సరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే క్వాలిటీ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. అయితే రూ.300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కేవలం ఇంటర్వెల్ సీక్వెన్స్ కి, క్లైమాక్స్ కి రూ.150 కోట్లను కేటాయించారట. ఇంటర్వెల్, క్లైమాక్స్ సినిమాకు హైలైట్ కానున్నట్లు సమాచారం. క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ చూసి అభిమానులు పండగ చేసుకుంటారని టాక్. ఇక డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కోమరం బీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఎన్టీఆర్ సరసన ఒలివియా, చరణ్ సరసన అలియా భట్ నటుస్తున్నారు.