
కరోనా లాక్డౌన్ తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా నిబంధనలను పాటుస్తూ ఆర్ఆర్ఆర్ టీం చిత్ర షూటింగ్ ప్రారంభించి కొమరం భీం టీజర్ అక్టోబర్ 22న వస్తుందని ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకే ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ అంచనాలతో రామరాజు ఫర్ భీం టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ టీజర్ విషయంలో తారక్ అభిమానిలు పెద్ద పెద్ద ప్లానింగులు మొదలెట్టేశారు. ముఖ్యంగా రాజమౌళి ఈ టీజర్ ను ఎలా కట్ చేస్తారు అనేదానిపైనే ఇప్పుడు అందరి ఆసక్తి నెలకుంది. ఈ రాబోయే టీజర్ లో అల్లూరిగా చరణ్ వాయిస్ ఓవర్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే ఆర్ఆర్ఆర్ టీం ఎన్టీఆర్ టీజర్ ను రిలీజ్ చేయటం ఆలస్యం అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో ట్రెండ్ చేసేందుకు అభిమానులు అన్ని సిద్ధం చేస్తున్నారు. ఆ టీజర్ ను చూడగానే అభిమానుల రోమాలు నిక్కపొడిచేలా ఉండటం ఖాయమని అంచనా వేస్తున్నారు. మరి రాజమౌళి టీజర్ ను ఎలా కట్ చేశారో తెలియాలి అంటే రెండు రోజులు ఆగాల్సిందే.