
సాహో విడుదలైన తరువాత, ఇప్పుడు అందరి దృష్టి యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే నటిస్తున్న ప్రభాస్ 20వ చిత్రం పైనే ఉంది. ఇప్పుడు తాజా అప్డేట్ ప్రకారం, మార్చి 25న ఉగాది సందర్భంగా #ప్రభాస్ 20 నిర్మాతలు ఈ చిత్ర టైటిల్‌ను వెల్లడించాలని నిర్ణయించారు. మేకర్స్ ప్రభాస్ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. జార్జియా షెడ్యూల్ కు వెళ్లేముందు, #ప్రభాస్ 20 బృందం, ప్రభాస్ మరియు పూజా హెగ్డేలతో కలిసి నాలుగు వేరువేరు దుస్తులలో ప్రత్యేకంగా నిర్మించిన ఇల్లు మరియు రైలు సెట్లలో యూరోప్ శకాన్ని ఫోటోషూట్ చేసిందని ఫిల్మ్ యూనిట్‌కు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఫోటోషూట్ వేరువేరు దుస్తుల్లో తీసిన నాలుగు ఫొటోల్లోప్రతిబింబించేలా రెండింటిని టీమ్ ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది. మేకర్స్ ఉగాదికి రిలీజ్ చేయబోయే ఫాస్ట్ లుక్ పోస్టర్స్ పై చాలా ఆనందంగా ఉన్నట్లు సమాచారం. ఇక ఉగాది నుండి ప్రభాస్ మేనియా స్టార్ట్ అవుతుందనమాట.