
మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ అయ్యి హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాతో 13ఏళ్ల తర్వాత ప్రముఖ సీనియర్ హీరోయిన్, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన చిరంజీవి విజయశాంతి మధ్య పొలిటికల్ గా విబేధాలున్న విషయం విదితమే. రాజకీయాల్లో ఉన్నప్పుడు చిరంజీవిపై ఘాటు వ్యాఖ్యలే చేసింది రాములమ్మ. తాజాగా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో రాములమ్మ మాట్లాడుతూ... "నాకు చిరంజీవికి రాజకీయాల పరంగా విబేధాలు ఉండేవి. కానీ సరిలేరు నీకెవ్వరు ప్రి రిలీజ్ ఈవెంట్ ద్వారా అవన్నీ తొలిగిపోయాయి. మాకు ఇప్పుడు ఎటువంటి విభేదాలు లేవు. చాలా రోజుల తర్వాత చిరంజీవిని కలవడం ఆనందంగా ఉందని" తెలిపారు.