
నిన్న జరిగిన హిట్ చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్ లో హీరో నాని వెబ్సైట్లలో అతని గురించి వచ్చిన కొన్ని రచనలపై స్పష్టత ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఆ రచనలు ఏమిటంటే, నాని మునుపటి నిర్మాణం "అ!" విమర్శకుల ప్రశంసలను పొందింది కానీ వసూళ్లు రాబట్టలేకపోయింది. అందుకే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అ! సిక్వెల్ తీయడానికి రెడీగా ఉన్నప్పటికీ ఏ నిర్మాత ముందుకు రావడం లేదని పలు వెబ్సైట్లలో ప్రచారం కావడంతో, వాటికి చెక్ పెట్టాలని నిర్ణయించుకొని క్లారిటీ ఇచ్చాడు నాని. అయితే, కొంతమంది అ! సినిమా కేవలం ప్రశంసలు అయితే దక్కించుకుంది కానీ డబ్బులు సంపాదించలేకపోయిందని చెబుతున్నారు. "నేను ఇప్పుడు దాన్ని క్లియర్ చేస్తున్నాను, నిర్మాతగా, అ! చిత్రం భారీగా డబ్బు సంపాదించింది మరియు ఐటి అధికారులు కూడా రైడ్ చేయడానికి కారణం ఇదే" అని నాని హిట్ ప్రి రిలీజ్ కార్యక్రమంలో తెలిపారు. ఇక 'హిట్' చిత్రం హీరో నాని యొక్క రెండవ నిర్మాణ వెంచర్ అని తెలిసిందే.