నా బాయ్ ఫ్రెండ్ తో విడిపోయాక….రోజుకు 12 టాబ్లెట్స్ తీసుకునేదాని: ఇలియానా సంచలన వ్యాఖ్యలు
4 years ago

దేవదాస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది గోవా బ్యూటీ ఇలియానా. తన నడుంఓంపులతో కుర్రకారును కట్టిపడేసింది. ఆమె కోసమే సినిమాకు వెళ్లేవారంటే అతిశయోక్తి కాదు. కానీ కొద్ది కాలానికి గోవా బ్యూటీకి అవకాశాలు తగ్గు మొఖం పట్టాయి. ఈమధ్యలో ఆమె అమెరికన్ అయిన ఆండ్ర్యూతో ప్రేమలో పడింది. అతనితోనే ఉంటూ ఫిలిం ఇండస్ట్రీకి కంప్లిట్ గా దూరమైంది. ఇక పెళ్లి చేసుకొని సెటిల్ అవుతుందని అనుకున్న సమయంలో తాను ఆండ్ర్యూ విడిపోయామంటూ షాకింగ్ వార్త చెప్పింది. దీంతో మళ్ళీ కెరియర్ పై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఆమె నటించిన తాజా హిందీ చిత్రం పాగల్ పంత్ శుక్రవారం రిలీజ్ అయింది. ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమెకు సంబంధించిన పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను కొంతకాలం డిప్రెషన్లో ఉన్నానని అందుకు ట్రీట్మెంట్ లో భాగంగా రోజుకు 12 టాబ్లెట్స్ తీసుకునేదానని అందుకే బరువు పెరిగిపోయానని...జిమ్ కు వెళ్లినా తగ్గలేదని తెలిపింది. జిమ్‌కు వెళ్లే సమయంలో మీడియా తీసిన ఫోటోల కారణంగా ట్రోలింగ్ తప్పులేదని చెప్పుకొచ్చింది.