
అ! లాంటి వినూత్నమైన సినిమా తరువాత నాచురల్ స్టార్ నాని ప్రదర్శిస్తున్న చిత్రం "హిట్". రిలీజ్ డేట్ దగ్గర్లో ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా ఈ సినిమా థియేటర్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్లో యువ హీరో విశ్వక్ సేన్ ఒక పోలీసు ఆఫీసర్ గా నటించాడు. అతను రహస్యంగా, తప్పిపోయిన ఒక యువతి ఆచూకీని కనుగొనే పనిలో ఉంటాడు. హిట్ యొక్క ట్రైలర్ ఒక ఆకట్టుకునే కథాంశాన్ని కలిగి ఉంది. స్టైలిష్‌గా చిత్రీకరించిన ఇన్వెస్టిగేషన్ విజువల్స్ మరియు వివేక్ సాగర్ యొక్క అద్భుతమైన సౌండ్‌ట్రాక్ కలిసి సినిమాపై థ్రిల్ భావాన్ని సృష్టిస్థాయి. విశ్వక్ సేన్ మరోసారి కొంపగా, ఆవేశంగా ఉండే పాత్రలో కనిపిస్తున్నాడు. 'చి లా సౌ' నటి రుహానీ శర్మ ప్రధాన పాత్రలో కనిపిస్తుంది. నూతన దర్శకుడు సైలేష్ కోలను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్లో ప్రశాంతి టిపిర్నేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 28న తెరపైకి రానుంది.