
షాద్ నగర్లో జరిగిన దిశ అత్యాచారం కేసు సంచలనంగా మారింది. ఈ కిరాతకానికి పాలుపడ్డ నిందితులను అదుపులోకి తీసుకొని హైదరాబాద్ చర్లపల్లి జైలులో రిమాండ్ లో ఉంచిన సంగతి తెలిసిందే. అయితే రిమాండ్ లో ఉన్న వారిలో ఒకరైన అరిఫ్ అక్కడి సిబ్బందితో ఒక విషయం వెల్లడించాడు. అంతా అనుకుంటున్నట్లు దిశ మరణించాక పెట్రోల్ పోసి కాల్చలేదట...ఆమె బ్రతికి ఉండగానే కాల్చినట్టు వెల్లడించాడు. ఆమెను బలవంతంగా తీసుకెళ్లే సమయంలో గట్టిగా అరుస్తుండటంతో కేశవులు ఆమెకు మద్యం తాగించడట.దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను లారీలో రేప్ చేసి తర్వాత డీసీఎం ఎక్కించాక మరోసారి రేప్ చేయటంతో ఆమె అపస్మారక స్థాయిలోనే ఉంది. దీంతో ఆమె చనిపోయినట్టుగా భావించి చటాన్‌పల్లి అండర్ పాస్ వద్దకు తీసుకెళ్లి బతికి ఉండగానే దహనం చేశారు.