
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే తన తదుపరి చిత్రం బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ రీమేక్ అన్న విషయం తెలిసిందే. ఇది వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చురుకైన వేగంతో షూటింగ్ జరుపుకుంటుంది. చిత్ర పరిశ్రమలో తాజా సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ 26వ చిత్రానికి 'వకీల్ సాబ్' అని పేరు పెట్టారు. పీకే నటిస్తున్న ఈ రీమేక్ టైటిల్ గురించి మేకర్స్ అధికారిక ప్రకటన చేయలేదు గానీ, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఫిల్మ్ ఛాంబర్లో వకీల్ సాబ్ పేరును నమోదు చేసినట్లు చెబుతున్నారు. రెండేళ్ల విరామం తర్వాత ఆయన ఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ కు మ్యూజిక్ అందించడానికి మేకర్స్ తమన్ ను తీసుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ 26 చిత్రం గురించి ఆసక్తికరమైన విషయాన్ని తమన్ ట్వీటర్ వేదికగా పంచుకున్నారు. సింగర్ సీడ్ శ్రీరామ్ తో ఉన్న ఫోటోను పెట్టి, తను పవన్ కళ్యాణ్ కోసం ఒక పాటను పాడుతున్నట్లు వెల్లడించాడు. సీడ్ శ్రీరామ్ పాడుతున్నాడంటే ఆ పాట కచ్చితంగా హిట్ అయ్యి తీరుతుందని మ్యూజిక్ లవర్స్ అంచనా వేస్తున్నారు.