
అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ములతో 'లవ్ స్టోరీ' అనే చిత్రంలో బిజీగా ఉన్నాడు. ఇది చురుకైన వేగంతో షూటింగ్ జరుపుకుంటుంది. తన కెరీర్లో తొలిసారిగా నాగచైతన్య రాబోయే చిత్రం ‘లవ్ స్టోరీ’ లో తక్కువ కుల కుర్రాడు (దళిత) పాత్రను పోషిస్తూన్నట్లు సమాచారం. ఈ చిత్రంలో నాగచైతన్య తక్కువ కుల కుర్రాడి పాత్రలో కనిపించనున్నట్లు లవ్ స్టోరీ ఫిల్మ్ యూనిట్‌కు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అతని పాత్ర చాలా చాలెంజింగ్‌గా ఉంటుందని, అతని ఇదివరకు సినిమాలకు ఎంతో భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. శేఖర్ కమ్ముల, ఉన్నత మరియు దిగువ కుల ప్రేమికుల మధ్య తలెత్తే వివాదం చుట్టూ కథను రాశారట. సంపన్న కుటుంబానికి చెందిన సాయి పల్లవి, అమాయకుడు, నిజాయితీపరుడైన వ్యక్తితో ప్రేమలో పడుతుంది. సినిమా అంతా నాగచైతన్య తెలంగాణ యాసలో మాట్లాడుతుండటం విశేషం. ఈ వేసవిలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.