
'అర్జున్ రెడ్డి' టాలీవుడ్ లోనే అత్యధికంగా చర్చించబడ్డ సినిమా. విజయ్ దేవరకొండను స్టార్ హీరోను చేసిన చిత్రం. అప్పట్లో ఇదొక సంచలనం. బోల్డ్ సినిమాతో భారీ హిట్ కొట్టాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఇక ఇందులో హీరోయిన్ గా నటించిన షాలిని పాండే ప్రతిభను చూసి మెచ్చుకొని వాళ్ళు లేరు. ఆమె కచ్చితంగా స్టార్ హీరయిన్ అవుతుందని అందరూ భావించారు. కానీ స్టార్ హీరోయిన్ అవ్వకపోవడం సహా ఆ తరువాత మంచి హిట్ కూడా లేదు. మహానటి, కళ్యాణ్ రామ్ తో 118 , ఎన్టీఆర్ కధానాయకుడు, రాజ్ తరుణ్ తో ఇద్దరి లోకం ఒక్కటే వంటి సినిమాల్లో చేసింది. కానీ వాటిల్లో 118 మాత్రమే హిట్ అయింది. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న అనుష్క నిశ్శబ్దం కూడా ఆమెకు ఎలానూ ఉపయోగపడలేదు. మరి ఆమె సినిమా కెరియర్ ప్రశ్నార్ధకంగా మారినట్లే అనిపిస్తుంది.