
బిగ్ బాస్ సీజన్ 4 లో అమ్మా రాజశేఖర్ కారణంగా గోడవలు ఏ రేంజ్ లో అవుతున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నిన్నటికి నిన్న ఆమ్లెట్ కోసం అభిజిత్ మరియు మోనాల్ తో పెద్ద గొడవే జరిగింది. ఇంత జరుగుతున్నా అమ్మ రాజశేఖర్ ఎన్నిసార్లు నామినేషన్లో ఉన్నా ఏదొక కారణంతో సేవ్ అవుతూ వస్తున్నారు. బయట మాత్రం ఆయనకు కొంత వ్యతిరేకంగానే ఉంది. మరి అలాంటిది ఆయన ఎలా సేవ్ అవుతూ వస్తున్నారనేది ప్రశ్నగా మిగులుతుంది? మొన్నటికిమొన్న నామినేషన్ల నుంచి తప్పించుకునే ఒక అవకాశాన్ని బిగ్ బాస్ ఇంటి సబ్యులకు కలిపించారు. అది ఎందుకు అమ్మ కోసమేనా? అనే అనుమానాలు వినపడుతున్నాయి. ఇప్పుడు ఏకంగా ఆయన కెప్టెన్ అయ్యారంటూ వార్తలొస్తున్నాయి. అంతేకాకుండా వెళ్తూ వెళ్తూ రాజశేఖర్ ను చివాట్లు పెట్టిన నోయల్ అతన్ని కెప్టెన్సీ టాస్క్ కు ఎందుకు నమోదు చేస్తాడు? నోయల్ పేరు చెప్పి బిగ్ బాసే ఆ పని చేశారా? ఇలా అమ్మ రాజశేఖర్ సేవ్ అవ్వడంపై ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి.