
ఇటీవలి కాలంలో, నందమూరి బాలకృష్ణ బహిరంగ ప్రదేశాల్లో బట్టతల, నల్ల మీసాలతో కనిపిస్తున్నారు. మొదట బోయపాటి శ్రీను సినిమా కోసం తన కొత్త లుక్ ప్రేక్షకులకు అలవాటు పడేలా చేయటానికి ఇలా కనిపిస్తున్నారని అనుకున్నారు. కానీ, బాలయ్య ఇలా కనిపించటం వెనుక ఒక కారణం ఉన్నట్లు తెలుస్తోంది. బాలయ్య జుట్టు మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నట్లు సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరోల మాదిరిగా వారి బట్టతలనెత్తిమీద హెయిర్-ఫోలికల్స్ వచ్చేలా చికిత్స చేయించుకున్నారు. అయితే, శస్త్రచికిత్స ఉహించిన విధంగా విజయవంతం కాలేదని ఇప్పుడు ఒక ప్రచారం సాగుతుంది. నటసింహం, చికిత్స అనంతరం అదనపు శ్రద్ధ తీసుకున్నప్పటికీ, ఫలితం లేకపోయింది. శస్త్రచికిత్సకు ముందు మరియు తరువాత, నటుడు ఏమైనప్పటికీ మంచి ఫలితం కోసం విగ్స్ ధరించవద్దని వైద్యులు సూచించారు. ఇక ఇప్పటికైతే బోయపాటి శ్రీను సినిమా కోసం బాలయ్య స్పెషల్ విగ్స్ ధరించి కొన్ని రోజుల తరువాత మళ్ళీ శస్త్రచికిత్స చేయించుకుంటున్నారని సమాచారం.