
జగపతి బాబు అలియాస్ జగ్గూ భాయ్ ఒకప్పుడు హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్ ను తన నటనతో కట్టిపడేసాడు. కొన్నాళ్లకు హీరోగా అవకాశాలు తగ్గాక అప్పుల్లో కూరుకుపోయిన జగ్గూ భాయ్ ను బోయపాటి తన సినిమా లెజెండ్ లో విలన్ గా పరిచయం చేయడంతో ఆయన దశ మళ్ళీ తిరిగింది. ఆ రోజు నుంచి తెలుగులో స్టైలిష్ విలన్ గా మంచి ఫామ్ లో ఉన్నారు. వరసగా టాప్ సినిమాల్లో విలన్ గస్ చేస్తూ బిజీ అయ్యారు. కానీ ఈమధ్యకాలంలో జగ్గూ భాయ్ కు తెలుగులో ఆఫర్లు తగ్గినట్లు తెలుస్తోంది. మొన్నీమధ్య మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న "సరిలేరు నీకెవ్వరు" చిత్రంలో ముఖ్యపాత్రకు జగ్గూ భాయ్ ను తీసుకొని కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన తర్వాత ఆయన సినిమా నుంచి తప్పుకోవడం ఆ తర్వాత ప్రకాష్ రాజ్ రావటం జరిగింది. అయితే ఆ రోజు నుంచి ఇప్పటి వరకు జగపతి బాబుకు ఒక్క తెలుగు ఆఫర్ కూడా రాలేదని తెలుస్తోంది. మరి దానికి కారణం మహేష్ బాబు సినిమాకు నో చెప్పడమా ? లేదా పర్సనల్‌గానే ఏమైనా బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నాడా తెలియాలంటే జగ్గు భాయ్ నోరు విప్పేవరకు వెయిట్ చేయాల్సిందే.