
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 భారీ అంచనాల నడుమ నాగార్జున హోస్ట్ గా గ్రాండ్ గా ప్రారంభై ఐదో వారంలోకి చేరుకుంది. అయితే గత రెండు వారాలుగా సోహెల్-మెహబూబ్ మధ్య ఉన్న బంధాన్ని చూస్తున్న ప్రేక్షకులకు సోహెల్ మెహబూబ్ ను వాడుకుంటున్నాడనే భావన కలుగుతుంది. ఇది చివరికి ఎవరు గేమ్ ను తెలివిగా ఆడుతారో వాళ్ళకే ఓట్లు వేస్తారు. అది మెహబూబ్ మర్చిపొతున్నట్లుగా ఉంది. నిన్న బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ కు గెస్ట్‌ల గ్రూప్ నుండి బాగా ఆడిన ఒక పోటీదారుడి పేరు చెప్పుమనగా సోహెల్, మెహబూబ్ ను నేను నీకు మొన్న అవకాశం ఇచ్చాను ఈసారి నువ్వు నాకు ఇస్తావా లేదో ఇంకా నీ ఇష్టమంటూ మాయమాటలతో ఒప్పించినట్లుగా అనిపించింది. కెప్టెన్సీ అంటేనే నామినేషన్ల నుండి తప్పించుకునే ఇమ్యూనిటీ. అలాంటిదాని డేంజర్ జోన్ లో ఉన్న మెహబూబ్ వదులుకోవడం తెలివితక్కువతనమని ప్రేక్షకులు భావిస్తున్నారు.