
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోరపరాజయం పాలైన సంగతి తెలిసిందే. టీడీపీ నుంచి పోటీ చేసిన వారిలో కేవలం 23 మంది విజయం సాధించారు. దీంతో పార్టీ బలహీనపడిందని భావించిన టీడీపీ నేతలు మెల్లగా జంప్ అవుతున్నారు. వలసలు పెరిగేసరికి చంద్రబాబుకు టెన్షన్ పెరిగింది. దానికి తోడు తాజాగా బీజేపీ ఎంపీ సుజనాచౌదరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, అలానే వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు తమతో టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 20 మంది టచ్ లో ఉన్నారంటే ఇంకా పార్టీలో ముగ్గురే. అది చంద్రబాబు, బాలకృష్ణ, కేశవ్ అని వైసీపీ నేత ఎంపీ రఘురామకృష్ణ జోష్యం చెప్పారు. సుజనా వ్యాఖ్యలకు తమ పార్టీ నుంచి ఎవ్వరు వెళ్లడం లేదని టీడీపీ, వైసీపీ వెంటనే కౌంటర్ ఇచ్చింది. అయితే సీఎం జగన్ తలుచుకుంటే అరగంటలో టీడీపీ ఖాళీ అవుతుందని వైసీపీ నేతలు అంటున్నారు.