
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఒక సినిమా రానుందని ఎప్పటి నుంచో వార్త ప్రచారంలో ఉంది. కానీ ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న వివరాలపై మాత్రం క్లారిటీ లేదు. అయితే తాజా సమాచారం ప్రకారం వెంకీ మామను పూర్తి చేసిన వెంకటేష్ ప్రస్తుతం అసురన్ రీమేక్ లో బిజీగా ఉన్నాడు. అసురన్ పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ తోనే సినిమా ఉంటుందని ఇన్సైడ్ టాక్. ఇప్పటి వరకు వెంకీ సినిమాలకు రచయితగా పని చేసిన త్రివిక్రమ్ తో సినిమా అనేసరికి భారీ అంచనాలు నెలకున్నాయి. దీంతో వచ్చే ఏడాది మధ్యలో సినిమాను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇకపోతే ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న "అల...వైకుంఠపురంలో" జనవరి 12న రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబోలో మూడో చిత్రం అవ్వటంతో అంచనాలు భారీగా ఉన్నాయి.