
సైరా నరసింహరెడ్డి తరువాత, సురేందర్ రెడ్డి తదుపరి సినిమా సంబంధించి అధికారిక ప్రకటన చేయలేదు. అతని తదుపరి చిత్రం ఏమై ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు సురేందర్ రెడ్డి మెగాను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడని తెలుస్తోంది. ప్రిన్స్ వరుణ్ తేజ్ తో తన నెక్స్ట్ సినిమా ఉండబోతుందని ఆ మధ్య ప్రచారం సాగిన విషయం తెలిసిందే. కథ నచ్చడంతో వరుణ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అతి త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారని జోరుగా వార్తలు వచ్చాయి. ఇంక మెగా ప్రిన్స్ కు స్టార్ డైరెక్టర్ తో సినిమా పడిందని, వీరి కాంబో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇప్పుడు నిరాశే మిగిలేటుంది. తాజా చర్చ ఏమిటంటే, సురేందర్ రెడ్డి- వరుణ్ ప్రాజెక్ట్ జరగడం లేదు. సురేందర్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ను పక్కన పెట్టి, స్టార్ హీరో కోసం కొత్త స్క్రిప్ట్ రాస్తున్నారు. ఇటు, మెగా హీరో తన కొత్త చిత్రం బాక్సర్ కోసం ప్రిపేర్ అవ్వడంలో బిజీగా ఉన్నాడు. ఇది త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి వరుణ్ ముంబైలో శిక్షణ పొందుతున్నాడు.