
రవితేజ ఇటీవలి చిత్రాలు ఏవీ బాక్సాఫీస్ వద్ద హిట్ అవ్వకపోయినా, కొంతమంది నిర్మాతలు రవితేజ ఇప్పుడు మంచి కమ్ బ్యాక్ ఇస్తారని ఆశిస్తున్నారు. అతని తదుపరి చిత్రం, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'క్రాక్'. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఇది ఇంకా రిలీజ్ అవ్వకముందే అతని మరొక చిత్రం గురించి ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. క్రాక్ తరువాత, రవితేజా రాక్షసుడు సినిమా ఫేమ్ రమేష్ వర్మతో థ్రిల్లర్ సినిమా కోసం జతకట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రం తమిళ సినిమాకు రీమేక్ అవుతుందని సమాచారం. అయితే, రవితేజ పోషించే పాత్రలలో ఒకదానికి, ఇస్మార్ట్ శంకర్ ఫెమ్ నిధి అగర్వాల్ ఖరారు అయ్యిందని వార్తలొస్తున్నాయి. రవితేజ ఇస్మార్ట్ అమ్మాయితో జతకట్టడం ఇది రెండోసారి, ఇంతకుముందు డిస్కో రాజాలో నభా నటేష్ తో రొమాన్స్ చేశాడు. అయితే , ఈ వార్త విన్నవారంత రవితేజ సరసన నిధి చిన్న అమ్మాయిగా కనిపిస్తుందని అభిప్రాయపడుతున్నారు. మరి డైరెక్టర్ తెరపై ఎలా చూపిస్తాడో చూడాలి.