
'సరిలేరు నీకెవ్వరు' చిత్రం సక్సెస్ తో అతి తక్కువ టైంలో రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరింది హీరోయిన్ రష్మీక మందన్న. కన్నడ భామ అయినప్పటికీ టాలీవుడ్ లో వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోల సరసన అవకాశాలను దక్కించుకుంటుంది. అయితే రష్మీక మందన్న ఇంటిపై ఐటి అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తుంది. విరజ్‌పెట్ లోని రష్మీక నివాసంపై జనవరి 16 ఉదయం 7:30 గంటలకు ఐటి దాడులు జరిగినట్లు సమాచారం. టాక్స్ ఎగవేత ఆరోపణపై రష్మీక ఇంటిపై తనిఖీలు జరిపినట్లు కన్నడ ప్రముఖ ఛానెల్ ద్వారా తెలుస్తోంది. పది మంది ఐటి అధికారులు మైసూరు నుండి క్యాబ్‌ల ద్వారా విరజ్‌పెట్ రష్మీక నివాసంకు చేరుకొని... సంపాదనకు తగ్గట్టుగా టాక్స్ కడుతుంది లేనిది తెలుసుకునేందుకు తనిఖీలు నిర్విహించినట్లు సమాచారం. ఇకపోతే రష్మీక ప్రస్తుతం నితిన్ హిరోగా తెరకెక్కుతున్న 'బిష్మ' లో నటిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా నటించనుంది.