
విజయ్ నటించిన 'బిగిల్' బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అయితే బాక్సాఫీస్ వద్ద సుమారు 300 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ సినిమాకు సంబంధించి ఐటి సోదాలు నిర్వహించారు అధికారులు. చెన్నైలోని ఫైనాన్సర్ ఆరోపణల మేరకు విజయ్ నివాసం నుంచి ఆదాయపు పన్ను అధికారులు రూ .65 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, పన్ను ఎగవేత ఆరోపణలపై మరియు ఫైనాన్షియర్ అన్బు చెజియాన్తో తనకు ఉన్న సంబంధాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు, సోమవారం చెన్నైలోని పనైయూర్ ప్రాంతంలోని విజయ్ నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. విజయ్ను మరిన్ని వివరణల కోసమే ఐటి విభాగం అధికారులు సోమవారం నివాసంకు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే, సమన్లు ధృవీకరించడానికి లేదా తిరస్కరించడానికి సీనియర్ ఆదాయపు పన్ను అధికారి నిరాకరించారు.