
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్, రష్మీక మందన్న జంటగా తెరకెక్కుతున్న చిత్రం "సరిలేరు నీకెవ్వరు". దిల్ రాజు సమర్పణలో రామ బ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే యూఎస్ లో మహేష్ కు మంచి మార్కెట్ ఉంది. టాలీవుడ్ హీరోల్లో యూఎస్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోల్లో మహేష్ అగ్ర స్థానంలో ఉంటాడు. ఇప్పటికే శ్రీమంతుడు, భారత్ అనే నేను, మహర్షి ఇలా మహేష్ సినిమాలు ఎన్నో మిలియన్స్ డాలర్ల మార్క్ ను అందుకున్నాయి. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు కూడా మిలియన్ డాలర్ల మార్క్ ను అందుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాల అంచనా. ఈ నేపథ్యంలో యూఎస్ లో సరిలేరు నీకెవ్వరు సినిమా టికెట్ ధర 20 నుంచి 21 డాలర్ల వరకు పలుకుతుందట. మహేష్ సినిమాకు ఉన్న క్రేజ్ దృశ్య ఈ ధర నిర్ణయించినట్లు సమాచారం.