
అక్కినేని నాగార్జున యాంకర్ గా 16 మంది కంటేస్టెంట్లతో బిగ్ బాస్ 4 తెలుగు అంగరంగ వైభవంగ మొదలైన విషయం తెలిసిందే. కొంత మంది కొత్త మోహాలు, కాస్త సప్పగా సాగిన ఇప్పుడు షో పుంజుకుంది. అయితే గత వారం డైరెక్టర్ సూర్య కిరణ్ ఎలిమినెట్ కాగా నటుడు సాయి కుమార్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కంటేస్టెంట్లలో అందరికన్నా వయసులో పెద్దైన గంగవ్వ ఇంకెన్నో రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉండదని తెలుస్తోందిఎం దీంతో ఆమె ప్లేస్ లో మరొకరిని దింపేందుకు యాజమాన్యం సిద్ధమవుతుంది. అందుకే జబర్దస్త్ కామెడీ షోతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న ముక్కు అవినాష్ ను గంగవ్వ ప్లేస్ లో వైల్డ్ కార్డు ఎంట్రీగా దింపాలని ప్లాన్ చేస్తున్నారు. మరి అది వచ్చే వారం అవుతుందా ఆపై వారం అవుతుందో చూడాలి.