
ఏదో మాములు షోగా ప్రారంభమైన జబర్దస్త్ మెల్లమెల్లగా జనాదరణ పొంది అదిరిపోయే టిఆర్పీలతో నెంబర్ వన్ కామెడి షోగా అవతారం దాల్చింది. జబర్దస్త్ ఎంత పాపులర్ అయిందంటే మొదట గురువారం మాత్రమే ప్రసారమయ్యేది కొంతకాలంగా ఎక్స్ట్రా జబర్దస్త్ అంటూ శుక్రవారం కూడా ప్రసారమవుతుంది. ఒక రోజు జబర్దస్త్ తో అనసూయ అలరిస్తుండగా ఇంకో రోజు ఎక్స్ట్రా జబర్దస్త్ తో రష్మీ ఎంటర్టైన్ చేస్తుంది. షో ఆ రేంజ్ లో హిట్ అయింది కాబట్టే సీరియల్ నటులు కూడా ఇందులోకి వచ్చి అలరిస్తున్నారు. రోహిణి, సత్య శ్రీ అలానే స్కిట్లతో అదరగొడుతుండగా తాజాగా మరో అందాల భామ జబర్దస్త్ లో చేరింది. తనే వర్ష. తూర్పు పడమర, ప్రేమాభిషేఖం వంటి సర్యల్స్ లో ముఖ్య పాత్రలు పోషించిన వర్ష ఇప్పుడు జబర్దస్త్ ద్వారా తనలోని కామెడీ యాంగిల్ ను పరిచయం చేస్తుంది. వర్ష ఎక్కువగా హైపర్ ఆది స్కిట్లలో కనిపిస్తుంది. అయితే షోలో ఆమెను చూసినవారంత మైమర్చిపోతున్నారు.