
అతిలోక సుందరి, అలనాటి తార శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వికపూర్ తాజాగా తన డ్యాన్స్‌తో నెటిజన్లను ఫిదా చేశారు. ఫ్యాషన్, ఫిట్నెస్ పోస్టులతో తరచూ సోషల్‌మీడియా వేదికగా అభిమానులకు చేరువగా ఉండే జాన్వి తాజాగా బెల్లీ డ్యాన్స్ వీడియోతో మెప్పించారు. కరీనాకపూర్ - షారుఖ్ ఖాన్ జంటగా నటించిన ‘అశోక్’ చిత్రంలోని ‘సన్ సననా’ అనే పాటకు బెల్లీ డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టా వేదికగా షేర్ చేస్తూ.. ‘బురిటో బెల్లీ డ్యాన్స్ సెక్షన్లను మిస్ అవుతున్నా’ అని పేర్కొన్నారు. కాగా, జాన్వి షేర్ చేసిన వీడియోకు నెట్టింట్లో మంచి స్పందన లభించింది. నెటిజన్లు మాత్రమే కాకుండా మనీశ్ మల్హోత్ర, మహీప్ కపూర్, సంజయ్ కపూర్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు సైతం జాన్విపై ప్రశంసల వర్షం కురిపించారు.