
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న క్రమంలో మంగళవారం రాత్రి తిరుమలకు చేరుకొని రాత్రి అక్కడే బస చేసి ఈరోజు ఉదయం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తీర్ధప్రసాధాల విరామ సమయంలో పవన్ స్వామి దర్శనం చేసుకున్నారు. ఆలయ అధికారులు పవన్ ను దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శించుకున్న అనంతరం మొక్కులను చెల్లించుకున్నారు. ఆ తరువాత రంగనాయక మండపంలో అర్చకుల వేద ఆశీర్వచనాలను అందుకుని తీర్ధ ప్రసాదాలను సేవించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్...స్వామి వారి సన్నిధిలోనే తనకు అక్షరాభ్యాసం జరిగిందని తెలిపారు. ఏడుకొండల స్వామి నుంచి ధర్మో రక్షత రక్షతి: నేర్చుకున్నాని. దాన్నే త్రికరణశుద్ధితో పాటిస్తున్నాని తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని కోరుకుంటున్నట్లు చెప్పారు.