
ఒకోసారి సినిమా కంటే దానిపై వచ్చే రూమర్లే ఎక్కువగా వింటుంటాము. అదే జరుగుతుంది మెగాస్టార్ సినిమా 'ఆచార్య' మొదలైన రోజు నుంచి. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సోషల్ డ్రామా నేపధ్యంలో 'ఆచార్య' సినిమా మొదలై అందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నారని తెలిసిందే. అయితే, చరణ్ సరసన హీరోయిన్ గా ఎవరు నటించనున్నారనే దానిపై ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. రష్మిక నుండి కియారా వరకు అందరి పేర్లు వినిపించాయి. మొన్నీమధ్య తమన్నా పేరు కూడా వినపడింది. ఇప్పుడు తాజాగా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ పేరు వినిపిస్తుంది. ఇప్పటికి ఏది క్లారిటీ లేకపోవడంతో ఒకదాని తర్వాత ఒకటి రూమర్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి.