
గత ఏడాది అక్టోబర్ లో తమిళంలో రిలీజ్ అయిన "96" భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు రీమేక్ హక్కులను దక్కించుకున్నారు. తమిళ్ '96'ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే తెలుగు రీమేక్ ను డైరెక్ట్ చేస్తున్నారు. తమిళ్ లో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించగా... తెలుగులో శర్వానంద్, సమంత జంటగా నటిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం సినిమా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న టీం మార్చ్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లు కూడా అలానే ప్లాన్ చేస్తుంది. అయితే తాజాగా జనవరి 9న సాయంత్రం 5 గంటలకు టీజర్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. మొన్న రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో సమంత లేకపోవడంతో నిరాశపడ్డ సమంత అభిమానులు టీజర్ లోనైనా సామ్ కనిపిస్తుందని ఆశపడుతున్నారు. మరి టీజర్ ఎలా ఉండబోతుందో తెలియాలి అంటే రేపటి వరకు ఆగాల్సిందే.