
టాలీవుడ్ మరోసారి మరో విలక్షణ నటుడిని కోల్పోయింది. ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి భయపెట్టి, నవ్వించి, ఎడిపించిన నటుడు జయప్రకాష్ రెడ్డి. 100 కుపైగా సినిమాల్లో నటించిన జయప్రకాష్ నిన్న గుండెపోటుతో గుంటూరులో తుదిశ్వాస విడిచారు. ప్రధాని మంత్రి సైతం జయప్రకాష్ మరణంపై సంతాపం తెలిపారు. అయితే జయప్రకాష్ ఒక హార్ట్ పేషంట్. కొన్ని నెలల క్రితం ఆయన గుండెకు స్టన్ట్ కూడా వెయ్యడం జరిగింది ఆ తరువాత ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. కానీ జయప్రకాష్ మినహా అతని కుటుంబ సభ్యులందరికి కరోనా సోకిందని సమాచారం. అతని భార్య, కూతురు, కుమారుడు, కోడలు అందరూ కరోనా భారిన పడ్డారని సమాచారం అందటంతో జయప్రకాష్ తీవ్ర ఆందోళనకు గురయ్యారట. అయితే, తన కుటుంబంలో సంభవించిన ఈ పరిస్థితి జేపీని కుంగదీసిందని అంటున్నారు. దీంతో గత రెండు రోజులుగా జేపీ తీవ్ర ఒత్తిడికి గురయ్యారని సమాచారం. ఆ ఒత్తిడి వల్లే ఆయనకు గుండెపోటు వచ్చిందని అంటున్నారు. ఏదేమైనా జేపీ మరణం చిత్ర పరిశ్రమకు తీరనిలోటు.