
ఒక్క సినిమాతో స్టార్ స్టేటస్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండకు కేవలం సౌత్ లోనే కాక బాలీవుడ్ లో కూడా అభిమానులు ఉన్నారు. ఏకంగా బీ టౌన్ ముద్దుగుమ్మలు కొందరు విజయ్ పై ప్రశంసలు కురిపించారు. అందులో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఒకరు. ఒక ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ చూడటానికి బాగుంటాడాని, నటన ఎంతో స్టయిల్ గా ఉంటుండాని చెప్పుకొచ్చింది. అప్పటి నుంచి ఈ ఇద్దరు ఎప్పుడు స్క్రీన్ పై కనిపిస్తారా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు. అయితే పూరి జగన్నాథ్ తో విజయ్ దేవరకొండ చేయనున్న "ఫైటర్" సినిమాకు బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దీంతో కరణ్ చెప్పడంతో ఈ సినిమాలో నటించేందుకు జాన్వీ కపూర్ అంగీకరించినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నటించేందుకు జాన్వీ రూ.3కోట్ల 50లక్షలు పారితోషకం డిమాండ్ చేసిందట. ఆమెకు డిమాండ్ చేసినంత ఇచ్చేందుకు దర్శకనిర్మాతలు రెడీగా ఉన్నారట.