
స్టార్ మాకు దీటుగా ఒక అనూహ్యమైన కాన్సెప్ట్ తో జెమినీ టీవీ జూ. ఎన్టీఆర్ హోస్ట్ గా ఓ రియాల్టీ షో ప్లాన్ చేస్తుందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా దీనికి సంబంధించిన మరో వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే....జూ. ఎన్టీఆర్ ఈ రియాల్టీ షోకి ఒక్కో ఎపిసోడ్ కు రూ. 30 లక్షలు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారట. ఈ షో లో మొత్తంగా 60 ఎపిసోడ్లు ఉన్నాయని తెలుస్తుంది. అంటే జూ.ఎన్టీఆర్ ఈ షోకు గాను రూ. 18 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఇప్పటి వరకు తెలుగు టెలివిజన్ చరిత్రలో ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకునేది ఎన్టీఆరే. అందుకే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కానీ ఇందులో ఎంత మాత్రం నిజముందో చూడాలి.