
అర్ధం కాలేదా? కరోనా ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసింది. ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి ఎక్కడి వారు అక్కడ ఆగిపోయారు. ఇక వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో తెలీదు అందుకే జాగ్రత్తలు పాటిస్తూ మనము ముందుకుసాగాలని ప్రభుత్వాలు చెప్పడంతో జనజీవనం మళ్ళీ మొదలయింది. ఈనేపథ్యంలో సినీ తారలు తమ పిల్లలితో కలిసి వెకేషన్లకు వెళ్తున్నారు. సుమారు 6 నెలల పాటు ఇంట్లోనే ఉండటంతో పిల్లల కోసం ట్రిప్‌లకు వెళ్తున్నారు. తాజాగా మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి కొన్ని రోజులు విదేశాల్లో ఎంజాయ్ చేయగా ఇప్పుడు జూ.ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకొని ఫ్యామిలీతో దుబాయ్ వెళ్లారు. ఈమేరకు జూ.ఎన్టీఆర్ హైదేరాబద్ ఎయిర్పోర్ట్ వద్ద ఫ్యామిలీతో కనిపించారు.
Tags: #Cinecolorz #jrntr #Vacation