
దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ కు కరోనా కారణంగా బ్రేక్ పడిన విషయం తెలిసిందే. అందుకే 5 నెలల క్రితం రిలీజ్ అవ్వాల్సిన జూ.ఎన్టీఆర్ 'భీమ్' టీజర్ వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పుడు ఎట్టకేలకు షూటింగ్ తిరిగి ప్రారంభించిన టీం అక్టోబర్ 22న రిలీజ్ చేస్తామని చిన్న మేకింగ్ వీడియోతో ప్రకటించారు. అయితే ఆ టీజర్ కు ఇంకా కేవలం కొన్ని గంటలే ఉండటంతో ఆర్ఆర్ఆర్ టీం అంచనాలను పెంచుతూ 'రేపే' అంటూ ఒక వీడియోను రిలీజ్ చేసింది. ఇదే వీడియోను రామ్ చరణ్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ జూ.ఎన్టీఆర్ నీకోసం బహుమతి రెడీ అయ్యిందంటూ పోస్ట్ చేయగా.. దానికి జూ.ఎన్టీఆర్ చమత్కారమైన రిప్లై ఇచ్చాడు. 'ఇప్పటికే 5 నెలల నుంచి బాకీ. రేపైనా ఇస్తావా? ఎందుకంటే నువ్వు మర్చిపోవద్దు, నువ్వు జక్కన్నతో పని చేస్తున్నావు' అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.