
1920వ దశకంలో బ్రిటిష్ ఇండియా నేపధ్యంలో ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టిఆర్ కొమరం భీమ్ పాత్రను పోషిస్తున్నట్లు తెలిసిందే. ఇటీవల కొమరం భీమ్ పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి ఆర్ఆర్ఆర్ నుండి కొమరం భీమ్ ప్రేక్షకులను రిలీజ్ చేశారు. ఆయితే ఆ టీజర్ లో యంగ్ టైగర్ జూ. ఎన్.టి.ఆర్ ను ముస్లింగా చిత్రీకరించినందున ఆదిలాబాద్ గిరిజన సమాజం చాలా కలత చెందింది. ముఖ్యంగా ముస్లిం స్కల్ క్యాప్ ధరించిన అతని పాత్ర వివాదానికి తెరలేపింది. ఆదిలాబాద్ గిరిజన సమాజంకు కొమరం భీమ్ పెద్ద స్ఫూర్తి. అలాంటి భీమ్ ను ముస్లిం వేషధారణలో చూపించడం సరి కాదని అది అతన్ని కించపరిచినట్లేనని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది టీజర్ రిలీజ్ అయిన రోజు నుంచి మొదలైంది. మరి ఇంత వ్యతిరేకత వ్యక్తం అవుతుంటే రాజమౌళి ఎందుకు మౌనం వహిస్తున్నారో.
Tags: #jrntr #Ramcharan #RRR #Tollywood