
ఇప్పుడు టాలీవుడ్ లో బడా దర్శకులు, నిర్మాతలు, హీరోలు పాన్ ఇండియాపైనే ఫోకస్ పెట్టారు. అందుకే ఏడాదికి ఒక సినిమా తీసేవాళ్ళు ఇప్పుడు రెండేళ్లకి ఒకటి తీసుతున్నారు. తమ మార్కెట్ ని పెంచుకునే దిశగా ఆఖరికి నేటి తరం హీరోలు కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే జూ. ఎన్టీఆర్ పరిస్థితి మాత్రం అయోమయంగా ఉంది. రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' ఎప్పటికి రిలీజ్ అయ్యెనో తెలియదు. వచ్చే ఏడాది దసరాకు విడుదలైన అయినట్టే. అయితే జూ.ఎన్టీఆర్ కెజిఎఫ్ ఫెమ్ ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియా సినిమా తీస్తున్నారని చాలా రోజులు కధనాలు వినిపించాయి. కానీ ఇప్పుడేమో సిన్ వేరేలా ఉంది. ప్రశాంత్ నీల్ ప్రభాస్ హీరోగా 'సలార్' సినిమాను ప్రకటించాడు. ఇక జూ.ఎన్టీఆర్ తో సినిమా ఇప్పట్లో లేనట్టే. మరి తారక్ పాన్ ఇండియా మార్కెట్ సంగతేంటి అని అభిమానులు ఆందోళన పడుతున్నారు.