
దర్శక దిగ్గజం రాజమౌళి బాహుబలి తర్వాత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' లో టాలీవుడ్ బిగ్గెస్ట్ ఫాలోయింగ్ ఉన్న జూ.ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అసలే సినిమా ఆలస్యం అవుతుందని అభిమానులు ఫీల్ అవుతుంటే కరోనా వచ్చి దాన్ని ఇంకా వెనక్కి నేటింది. మొన్నీమధ్యే షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. అయితే ఎడతెరుపు లేకుండా జరుగుతున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్ నుంచి విరామం తీసుకున్న ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు దుబాయ్ వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జూ.ఎన్టీఆర్ మరోసారి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చారు. లేత రంగు టి షర్ట్ లో భుజానికి ఒక బాగ్ వేసుకొని చాలా కాజువల్ గా కనిపించాడు ఎన్టీఆర్. మాస్క్ పెట్టుకొని ఉన్నా సరే బహిమానులు అతన్ని పసిగట్టారు. సినిమా కోసం ఎన్టీఆర్ తన రూపాన్ని ఏ విధంగా మార్చుతారో మనకి కొత్తేమి కాదు. అలా ఆర్ఆర్ఆర్ కోసం ఎన్టీఆర్ తన బాడీని ఎంత ఫిట్ మరియు బిల్డ్ చేసాడు టీజర్ లో చూసాము. ఇలా బయట దర్శనమిచ్చినప్పుడు మాత్రం ఏంటి ఇంత బక్కగా అయిపోయాడు అనేలా ఉన్నాడు తారక్.