
ఎంటర్టైన్మెంట్ అందించడంలో స్టార్ మా ఛానెల్ ఎప్పుడు ముందంజలో ఉంటుంది. టిఆర్పి పరంగా చూసుకున్నా స్టార్ మా సీరియల్స్, షోలు అలానే బిగ్ బాస్ టాప్ లో నిలుస్తున్నాయి. దీంతో ఆ దూకుడుకు బ్రేక్ పెట్టాలని ఒక రియాల్టీ షోను ప్లాన్ చేస్తుంది జెమినీ టీవీ. అది టాక్ షో అయుంటుందని ప్రచారం జరుగుతుంది. అది కూడా టాలీవుడ్ స్టార్ హీరో జూ.ఎన్టీఆర్ హోస్ట్ గా ఈ షోను నిర్వహించబోతున్నారని టాక్. జూ.ఎన్టీఆర్ వాక్ చాతుర్యం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ ను తెలుగు ప్రేక్షకులు నచ్చేలా చేయటంలో ఎన్టీఆర్ పాత్ర కచ్చితంగా ఉందనే చెప్పాలి. ఇప్పుడు అలాంటి హీరో జెమినీలో ఒక షోతో రాబోతున్నాడంటే నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ టిఆర్పి కనుమరుగవుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ మిగితా టాక్ షోలల మాములుగా ఉంటె మాత్రం హిట్ అవ్వడం కష్టమే కానీ కొంత కొత్తగా కొంత ఆసక్తిగా మలిస్తే మాత్రం టిఆర్పి రేస్ లో జెమినీ ముందుకు రావటం గ్యారెంటీ.