
కాజల్ అగర్వాల్ ఒక దశాబ్దం పాటు తెలుగు వెండితెరపై కనిపిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను ఏర్పర్చుకుంది. ఒక హీరోయిన్ దశాబ్దం పాటు ఏలిందంటే అది మాములు విషయమేమీ కాదు. ఎంతో మంది కొత్త హీరోయిన్లు వస్తున్న టైంలో కూడా కాజల్ కు అవకాశాలు ఎక్కడా తగ్గడం లేదు. "లక్ష్మీ కళ్యాణం" తో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు "చందమామ" సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత వరుసగా బడా హీరోల పక్కన నటించింది. మొదట గ్లామర్ పాత్రలకు మొగ్గు చూపినా ఇప్పుడు మాత్రం కాస్త నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. కాజల్ ఇప్పుడు కేవలం సీనియర్ హీరోల హీరోయిన్ అయ్యింది. అయితే తాజాగా హీరోయిన్ ఓరియెంటెండ్ సినిమాను ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఒక కొరియన్ మూవీని తెలుగు, తమిళ్, హిందీలో రీమేక్ చేసేందుకు దగ్గుబాటి రానా సన్నాహాలు చేస్తున్నాడట. ఆ సినిమా కోసం కాజల్ ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమాలో పోలీసు అధికారిగా కాజల్ కనపడనుంది.