
టాలీవుడ్ లో ఉన్న సీనియర్ పెళ్లి కానీ హీరోయిన్లలో నయనతార, త్రిష మరియు కాజల్ అగర్వాల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. అయితే ఇప్పుడు ఆ లిస్ట్ నుంచి కాజల్ అగర్వాల్ తప్పుకుంది. అర్ధం కాలేదా? ఎవరు గ్రీన్ బ్యూటీ కాజల్ పెళ్లి చేసుకోబోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించింది. ఆమె పెళ్లాడబోయే వరుడు వ్యాపారవేత్త 'గౌతమ్ కిచ్లు'. అతను డీసెర్న్ డిజైన్ అనే ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీని నడుపుతున్నారు. ఒక గొప్ప వ్యాపారవేత్తనే కాక మంచి మనసున్న వ్యక్తి అని కాజల్ సన్నిహిత వాళ్ళు అంటున్నారు. అక్టోబర్ ౩౦న ముంబై లోని 5 స్టార్ హోటల్ పెళ్లి జరగనుంది. కేవలం దగ్గరి కుటుంబ సభ్యుల నడుమ ఈ పెళ్లి జరగనున్నట్లు కాజల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.