
నటి కాజల్ అగర్వాల్ ముంబైకు చెందిన బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుని హానీమూన్ కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ హోటల్ లో రొమాంటిక్ గా ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. మొదట షూటింగ్లు ఉంటాయని వాయిదా వేద్దామని అనుకున్న కాజల్ కు బ్రేక్ దొరకడంతో భర్తలో వేల చేపల మధ్య రొమాంటిక్ గా ఎంజాయ్ చేస్తుంది. అయితే దీని కోసం ఈ జంట భారీగా ఖర్చుపెట్టినట్లు తెలుసుతుంది. మురాకా అండర్ వాటర్ హోటల్ లో ఒక్క రాత్రికి రూ. 35 లక్షల రూపాయిలు. అంటే బస, తిండి, సందర్శనా అంత కలిపి కాజల్ జంట సుమారు రూ. 5 కోట్ల వరకు హానీమూన్ కోసం ఖర్చు చేసుంటారని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.