
సౌత్ ఇండియన్ ఎవరు గ్రీన్ బ్యూటీ కాజల్ అగర్వాల్ కొద్దీ రోజుల క్రితం తాను పెళ్లి చేసుకుంటున్నాని ప్రకటించి అందరికి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆమెది ప్రేమ పెళ్లా లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లా అనేది తెలియదు కానీ 'గౌతమ్ కిచ్లు' అనే ప్రముఖ వ్యాపారవేత్తను పెళ్లాడబోతుంది. ఇప్పటికే ఈ అమ్మడు పెళ్లి పనులు మొదలైపోయాయి. పెళ్లి హడావిడిలో భాగంగా హల్దీ ఫంక్షన్ నిర్వచిన కుటుంబం...ఆ ఫంక్షన్ లో కాజల్ అగర్వాల్ వేసిన చిందులు, ఆమె అమాయకత్వపు చూపులతో ఉన్న ఫోటోలు చెల్లితో కలిసి వేసిన స్టెప్పులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పసుపు రంగు దుస్తుల్లో చేతికి,తలకు పూలతో అల్లిన గాజులు, బ్యాండ్ పెట్టుకొని ఎంతో చక్కగా కనిపిస్తుంది. ఆమె పక్కన కాబోయే శ్రీవారు గౌతమ్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది.