
సంక్రాంతి సందర్భంగా బరిలోకి దిగిన దర్బార్, సరిలేరు నీకెవ్వరు, అల...వైకుంఠపురంలో సినిమాలతో పాటు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా, మెహరిన్ హీరోయిన్ గా నటించిన 'ఎంత మంచివడవురా' సినిమా కూడా రిలీజ్ అయింది. జనవరి 15న రిలీజ్ అయిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా అలీతో సరదగా ప్రోగ్రాంకు వచ్చిన కళ్యాణ్ రామ్ జూ. ఎన్టీఆర్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జూ. ఎన్టీఆర్ ను మీరు ఎందుకు తమ్ముడు అని పిలవరు అని అలీ కళ్యాణ్ రామ్ ను అడగగా...దానికి సమాధానం ఇస్తూ..." నేను తారక్ ను ఎప్పుడూ నాన్న అనే పిలుస్తాను. మొదటి నుంచి అలానే అలవాటైపోయింది. అందుకే సినిమా కార్యక్రమాల్లోనూ అలానే పిలుస్తాను. తారక్ నాతో నాన్నగ, తమ్ముడిగ, అన్నగా ఉంటాడు. అతడిలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. అందుకే తారక్‌ని తమ్ముడని పిలవను. మా నాన్నంటే నాకు చాలా ఇష్టం. నాన్న లేని లోటును తారక్ తీరుస్తున్నాడు.'' అని కల్యాణ్ రామ్ పేర్కొన్నాడు.