
కమల్ హాసన్ భారతీయ సినిమాలో లివింగ్ లెజెండ్స్ లో ఒకరు. అతని కెరియర్ లో సాధించిన విజయాలు పోలికకు మించినవి. కమల్ ఇప్పుడు తన మక్కల్ నీతి మాయం పార్టీకి నాయకత్వం వహిస్తూ రాజకీయాల్లో చురుకుగా ఉన్నాడు. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇదిలావుండగా, కమల్ తన 1986 చిత్రం 'పున్నగై మన్నన్' లో నటి రేఖతో లిప్ లాక్ చేయడంపై ఇంటర్నెట్లో వివాదం చెలరేగుతోంది. రేఖ యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఈ చిత్రం సమయంలో తనకు పదహారేళ్ల వయసు అని, లిప్ లాక్ సిన్ జరుగుతుందని తనకు తెలియదని పేర్కొంది. ఆమె తీసేయమని కోరుకుందని, కానీ అసిస్టెంట్ డైరెక్టర్లు వసంత్, సురేష్ కృష్ణ ఈ సన్నివేశం అశ్లీలంగా ఉందని, కేవలం సన్నివేశాన్ని ఎలివేట్ చేస్తుందని ఆమెకు హామీ ఇచ్చారని తెలిపారు. కీలకమైన సన్నివేశంలో జలపాతం నుంచి పడి కమల్ ఆత్మహత్య చేసుకునే ముందు కళ్ళు మూసుకోవాలని లెజండరీ డైరెక్టర్ కె. బాలచందర్ చెప్పారు, అప్పుడు కమల్ హెచ్చరిక లేకుండా ఆమె పెదవులపై ముద్దు పెట్టుకున్నారని, ఆ సమయంలో దాని చాలా అసౌకర్యంగా భావించానని పేర్కొన్నారు. కానీ ఇది చాలా కాలం క్రితం జరిగిందని దానిని పెద్దది చేయడంలో ప్రయోజనం లేదని తెలిపారు. అయితే ఇది చూసిన నెటిజన్లు కమల్ హాసన్, స్వర్గీయ దర్శకుడు బాలచందర్ పై విమర్శలు కురిపిస్తున్నారు.