
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తెలుగు చిత్ర పరిశ్రమకు బాగా తెలిసిన ముఖమే. ఏక్ నిరంజన్ సినిమాలో ప్రభాస్ తో స్క్రీన్ స్పేస్ పంచుకున్నారు. బాలీవుడ్లో మాదకద్రవ్యాల వినియోగంపై వివాదాస్పద ప్రకటనలు మరియు ముఖ్యమంత్రి ఉద్దవ్ తాక్రే మరియు అతని కుమారుడు ఆదిత్య తాక్రేతో సహా మహారాష్ట్ర ప్రభుత్వంపై ఆమె చేసిన మాటల యుద్ధంతో కంగనా రనౌత్ గత కొన్ని రోజులుగా వార్తల్లో ఉన్నారు. మణికర్ణిక ఫేమ్ కంగనా ఒకే తెలుగు చిత్రంలో నటించినప్పటికీ టాలీవుడ్‌పై ప్రశంసలు కురిపిస్తోంది. కంగనా రనౌత్ ట్విట్టర్లో, బాలీవుడ్ విషయానికి వస్తే ప్రజల అవగాహన తప్పు అని రాశారు. అయితే అందరూ బాలీవుడ్ అగ్రస్థానంలో ఉందని అనుకుంటున్నారని. కాని నిజానికి తెలుగు పరిశ్రమనే అగ్రస్థానంలో ఉంది. టాలీవుడ్ అంచెలంచెలుగా ఎదుగుతూ పాన్ ఇండియాకు సినిమాలను అందిస్తుందని కంగనా తన అభిప్రాయాన్ని తెలియజేసింది.