
కన్నడ చిత్ర పరిశ్రమలో మాదకద్రవ్యాల సంబంధాలున్నాయనే దానిపై విచారణలో భాగంగా కర్ణాటక సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఉత్తర శివారులోని కన్నడ సినీ నటి రాగిణి ద్వివేది ఇంటిని శోధించారు. "కోర్టు నుండి సెర్చ్ వారెంట్‌తో, మహిళా పోలీస్ ఇన్స్పెక్టర్తో సహా 7 సిసిబి ఆఫీసర్లతో... నిషేధించబడిన మాదకద్రవ్యాలను ఇంట్లో ఉంచారా లేదా అని రాగిణి యొక్క ఫ్లాట్‌లో తనిఖీలు నిర్వహించారు" అని బెంగళూరు జాయింట్ కమిషనర్ సందీప్ పాటిల్ విలేకరులతో అన్నారు. ఉదయం నుంచి శోధిస్తున్నందున, రాగిణి ఇంట్లో డ్రగ్స్ దొరికాయా లేదా అన్న విషయం పాటిల్ చెప్పలేదు. అయితే ఉన్న అన్ని గదులు, వంటగది మరియు బాల్కనీలో ఉంచిన అన్ని పూల కుండీలతో సహా ఆఫీసర్లు స్కాన్ చేశారు. మరి ఈ తనిఖీలపై రాగిణి ఎలా స్పందిస్తుందో చూడాలి.