
బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ఖాన్ భర్త సైఫ్ అలీ ఖాన్ త్వరలో తమ రెండవ బిడ్డను ఆశిస్తున్నారు. ఈ జంట బుధవారం ఒక సంయుక్త ప్రకటనలో ఈ శుభవార్తను ధృవీకరించారు. వారి శ్రేయోభిలాషులకు వారు చూపిస్తున్న ప్రేమ మరియు అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు.
"మేము మా కుటుంబంలో మరో మెంబర్ ను త్వరలో స్వాగతిచెందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి మేము చాలా సంతోషిస్తున్నాము !! మీ ప్రేమ మరియు అభిమానానికి కోసం మా కృతజ్ఞతలు" అని ఈ జంట సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ ప్రకటన ఎప్పుడైతే చేశారో, సోషల్ మీడియాలో ప్రముఖులు తమ అభినందనలు తెలియజేస్తూ ట్వీట్లు చేస్తున్నారు.