‘కార్తికేయ 2’ కాన్సెప్ట్ వీడియో: మరో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ ఆన్ ది వే!
4 years ago 1 min read

హీరో నిఖిల్ స్నేహితుడు, దర్శకుడు చందూ మొండేటి కాంబోలో 2014లో వచ్చిన ఫాంటసీ థ్రిల్లర్ 'కార్తికేయ' బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించింది. అప్పటి నుండి, సినిమా సీక్వెల్ పై అంచనాలు మరియు ఎదురుచూపులు సినిమా ప్రేమికుల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే, 'కార్తికేయ 2' త్వరలో తెరకెక్కనుందని ఆ మధ్య నిఖిల్, చందూ మొండేటి ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో తాజాగా 'కార్తికేయ 2' గ్రాండ్ లాంచ్ సందర్భంగా, ఈ చిత్రం గురించి కొన్ని క్లూస్ అందించడానికి మేకర్స్ ఒక కాన్సెప్ట్ టీజర్‌ను విడుదల చేశారు. కార్తికేయ 2, 5118 సంవత్సరాల నాటి దైవ రహస్యాన్ని వెలికితీసే కథానాయకుడి తపన గురించి ఉంటుంది. టీజర్ విషయానికి వస్తే, భారత ఖండ, జెంబు ద్వీప్ కు చెందిన ఏళ్ల నాటి దైవ రహస్యాన్ని కథానాయకుడు తపనతో మానవజాతి శ్రేయస్సు కోసం ఎలా రక్షిస్తాడు అనేది మెయిన్ కధ. ఈ కాన్సెప్ట్ వీడియో చూస్తుంటే మరో ఆకట్టుకునే థ్రిల్లర్ రానున్నట్లు అర్థం అవుతుంది.