
13బీ, 24, మనం లాంటి సూపర్ హిట్స్ అందించిన దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన నాని "గ్యాంగ్ లీడర్" లో యంగ్ హీరో కార్తికేయ విలన్ రోల్ లో కనిపించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత హీరోగా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయాకు నిరాశే మిగిలింది. తాజాగా విలన్ గా నటించేందుకు కూడా సై అంటున్నాడు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా "ఫైటర్" సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో కార్తికేయ విలన్ గా కనిపించనున్నాడట. ఈ సినిమా బాక్సింగ్ నేపద్యంలో తెరకెక్కుతుంది. విలన్ కూడా బాక్సరేనట. అంటే కార్తికేయ సైతం బాక్సర్ గా కనిపిస్తాడనమాట. ఇకపోతే ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుందని జోరుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. ఏదేమైనా కార్తికేయ విలన్ రోల్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.